సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి పేర్ని నాని నేడు, శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైంది. ఆరడగుల అబద్ధం చంద్రబాబు.రాష్ట్రంలో సీఎం చంద్రబాబుతో సహా కూటమి నేతలు శ్వేతపత్రాల విడుదల పేరుతో పచ్చి అబద్దాలు చెబుతున్నారు. ప్రజలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల ద్రుష్టి మరల్చేందుకు గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు , సంక్షేమ పధకాలు ఫై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అదనపు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్నారు. ఇప్పుడు వినియోగ దారులకు బిల్లులు ఎక్కువగా బిల్లులు వేస్తున్నారు. ట్రూఅప్ ఛార్జీలు గురించి విలేకరులు అడిగితే నేనెప్పుడు ఆమాట అన్నాను అన్నారు. ప్రజలకు ఆస్తి పన్నుల భారం తగ్గిస్తామన్నారు. మరి ఏది? ఉచిత ఇసుక అంటారు.. భారీ రేట్లు పెట్టి వెంటనే డబ్బులు కట్టమంటారు. ఇసుక ఉచితం పేరుతో మళ్లీ ఇసుక దోపిడీ మొదలు పెట్టేసారు. రాష్ట్రంలో ప్రతీ పిల్లాడికి రూ.15వేలు ఇస్తామన్నారు.. ఏమైంది?. తల్లికి వందనం అంటూ పంగనామాలు పెట్టారు. రాష్ట్రంలో ఎవ్వరు హ్యాపీగా లేరు.. సంపద సృష్టించి అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు.. ఏమైంది? అభివృద్ధిపై ఎవరైనా ప్రశ్నస్తే బెదిరిస్తున్నారు. 2014 నుండి వారి పాలనలో సంపద కనిపించలేదు. అప్పులు సృష్టించడంలో ఏపీని మొదటి స్థానంలో నిలబెట్టారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చింది వైసీపీ వారిపై ఎర్రబుక్ అక్రమ కేసులు పెట్టడానికేనా? పోలవరాన్ని నాశనం చేసిందే చంద్రబాబు. ఆయన నిర్వాకం వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది.చంద్రబాబు, బీజేపీ కలిసే పోలవరాన్ని నాశనం చేశారు అంటూ పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు.
