సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తణుకు సమీపంలో పెరవలి గ్రామంలో నేడు, శనివారం డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘పొట్టి శ్రీరాములు జలధార ‘ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మరియు అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభలో రఘురామ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మరో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రజలకు శుద్ధి జలాలు అందించేందుకు, 2 ఏళ్ళలో ఈ ప్రాజెక్టు ఫలాలు ప్రజలకు అందేలా ప్రణాళికతో ‘పొట్టి శ్రీరాములు జలధార ‘ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా పవన్ కళ్యాణ్ ను అభినందిస్తున్నానని, మా ఉండి నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ జలధార వల్ల ఆక్వా కలుషిత నీరు బారి నుండి రక్షణ పొంది శుద్ధమైన మంచినీరు అందుతుందని, సర్ కాటన్ దొర మాదిరిగా పవన్ కూడా మా ప్రాంత ప్రజలు గుర్తుంచుకోంటారు అని ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో అభిమానులు ఆరు అడుగుల బుల్లెట్ అని తనను అంటారని కానీ నిజానికి ఆరడుగుల బుల్లెట్ రఘురామా కృష్ణంరాజు అని అన్నారు. ఆ వ్యక్తి సభలో ఉంటె సరదాగా ఉంటుంది. అయన మాట్లాడితే.. ఇప్పుడు ఇది అవసరమా? అనిపిస్తుంది. మరోసారి ఈసమయంలో ఆయన మాట్లాడితేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకోసారి పుల్లవిచ్చినట్లు ఉంటుంది. మరోసారి అది అవసరమే అనిపిస్తుంది. (ఇటీవల ‘భీమవరం డీఎస్పీ’ వివాదం గురించి పరోక్షంగా.. ?) కాబ్బటి ఆయనే ఆరడుగుల బుల్లెట్ అని ఛలోక్తి విసిరారు. .
