సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లోని అత్తిలి మండలం ఆరవల్లి, మంచిలి గ్రామాల్లో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా నిర్మించిన రైల్వే అండర్ పాస్‌లను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గత సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేశారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ, మరియు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ అన్నారు. అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దేశ వ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్లు, 1500 ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్‌పాస్‌లు ప్రారంభించి చేసి జాతికి అంకితం చేశారన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, మండల నాయకులు బాలం మహేష్, శ్రీధర్‌రెడ్డి, ఆరవల్లి ఉప సర్పంచ్ వెలగల అమ్మిరెడ్డి, జడ్పీటీసీ అడ్డాల జానకి, వైస్ ఎంపీపీ దాసం సునీత,డీఆర్‌సీ సభ్యులు జక్కంశెట్టి కుమార్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
