సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఆరేడు గ్రామంలో నేడు, సోమవారం పురాతన దేవాలయం శ్రీ కేశవ స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరటంతో 84 లక్షలతో ఆ దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్న నేపథ్యంలో ఆలయాలు పున నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం లో ఉండి ఎమ్మెల్యే కనుమూరి రామకృష్ణంరాజు పాల్గొని వేద పండితుల వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
