సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ నేడు, తన సీఎం కార్యాలయం నుండి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు తో ‘ఆరోగ్య సురక్ష’ ఫై నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడుతూ.. ఒక కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు పూర్తిగా నయం అయ్యేంతవరకూ వాళ్ళు ఆరోగ్యం కోసం అప్పుల పాలు కాకుండా వారికీ చేదోడుగా నిలవడమే జగనన్న ఆరోగ్య సురక్ష ప్రధాన ఉద్దేశమని అన్నారు. ‘‘ఈ కార్యక్రమంలో మొదటి అడుగుగా ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడపడుతూ, అందరికీ పరీక్షలు నిర్వహించాం .అర్బన్ ఏరియాల్లో 91 శాతం , రూరల్ ఏరియాల్లో 94శాతం స్క్రీనింగ్ పూర్తయ్యింది. 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే స్క్రీనింగ్ పూర్తిచేశారు. 6.4 కోట్ల ర్యా పిడ్ పరీక్షలు నిర్వహించారు. ‘జగనన్న సురక్ష క్యాంపుల్లో నవంబర్ 5 కల్లా 85వేల మం ది పేషెంట్లను తదుపరి చికిత్సల కోసం నెట్ వర్క్ ఆస్పత్రి/ టీచింగ్ ఆస్ప త్రులకు రిఫర్ చేశారు. ఇప్పటికే 13,850 కేసులను చేయూత నిచ్చి వారిని తదుపరి చికిత్స లకోసం ఆస్పత్రులకు పంపించడం జరిగింది. ఇప్పటిదాకా 8.7 లక్షల మందికి కంటి పరీక్షలు చేయించుకున్నా రు. 5.22 లక్షల మం దికి కం టి అద్దాలు ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. మిగిలిన వారిని కూడా ఆస్పత్రులకు పంపించి వారికి మంచి చికిత్స అందించేలా తగిన చర్యలు తీసుకోవాలి. డిసెంబర్ నెలాఖరు నాటికి వీటిని పూర్తిచేయాలి. రిఫరల్ ఆస్ప త్రులకు వెళ్లేందుకు ఈ పేషెం ట్లకు రూ.500లు ప్రయాణ ఖర్చు లు కూడా ఇవ్వాలి. ఒకవేళ ఆరోగ్య శ్రీ ప్రొసీజర్లో కవర్ కాని కేసులు ఫ్యామిలీ డాక్టర్ రిఫరెన్స్ ద్వారా జిల్లా ఆస్పత్రికి, బోధనాసుపత్రులకు పంపించి ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలి. అలాంటి రోగాలకు కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స లు అందించేలా చర్యలు తీసుకోవాలి’’ అని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *