సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి సోమవారం నుంచి ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రెవేటు ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవ( ఆరోగ్యశ్రీ )పధకం క్రింద రోగులకు వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. తమకు రావాలసిన బకాయిలు చెల్లించాలని వివిధ దశల్లో నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం ఆందోళనలు చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్లకు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ వినతిపత్రాలు ఇచ్చామని సుమారు రూ.3,500 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, ప్రభుత్వం స్వాదించి బకాయిలు విడుదల చేయకుంటే ఇక నిర్వహణ కష్టం అని ఆసుపత్రుల సంఘం సభ్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆసుపత్రుల యజమానుల సంఘాన్ని చర్చలకు పిలిచి ఒప్పదం చేసుకోకపోతే పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు రోగులు వైద్య చికిత్సలు అందాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
