సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఆరోగ్య శ్రీ పథకాన్నిపరిమితిని 5 లక్షల వైద్య ఖర్చు పరిమితి నుండి ఇకపై 25 లక్షలకు పెంచడం జరిగిందని అధికారికంగా ప్రకటించారు.ఇంకా పలు వైద్యానికి చెందిన అంశాలపై సీఎం చర్చించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…‘‘రాష్ట్రంలో వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పాలు కాకూడదు.. వైద్యం అందక రాష్ట్రంలో ఎవరు ఇబ్బందులు పడకూడదని ఆరోగ్యశ్రీని ఎప్పుడూ లేని విధంగా మరో ముందడుగుకి శ్రీకారం చుట్టాం’’ ఇకపై వాలంటర్స్ రోగులను గుర్తించి వారి ఇండ్ల వద్దకే ఉచితంగా మందులకు అంజేసే పక్రియ కూడా ప్రారంభిస్తున్నాము అని సీఎం జగన్‌రెడ్డి చెప్పారు.‘వైఎస్సార్ ఆరోగ్య శ్రీపై ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పిస్తాం. ప్రతి ఇంటికి వెళ్లి కార్డులు పంపిణీ చేస్తాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు చికిత్స ఖర్చు దాటితే ఆరోగ్య శ్రీలోకి తీసుకువచ్చాం. ఉచిత ఆరోగ్యశ్రీ సేవలను మరిన్ని ఆస్పత్రులకు విస్తరించాం. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కింద సంవత్సారానికి 4100 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఒక్క కేన్సర్‌కే 1900 కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వ హయాంలో 108, 104 వాహనాలు వచ్చేవి కావు. ఇప్పుడు వాటిని పూర్తిస్థాయిలో ఆధునీకరించి అందరికి అందుబాటులోకి తీసుకువచ్చాం’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *