సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:
మనస్సు గాయపడిన వారు క్షణికావేశంలో ఎన్నో రకాలుగా ఆత్మహత్య లకు పాలబడటం చూస్తూ ఉంటాం.. అయితే తాజాగా నేడు,ఆదివారం ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఓ యువకుడు మృతిచెందాడు. పైగా ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో సంచలనం రేపింది.. బస్సు ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రేణిగుంట వద్ద కండక్టర్ దీన్ని గుర్తించారు. బస్సులో చివరి సీటు వద్ద ఉన్న హ్యాంగర్‌కు ఆ యువకుడు ఉరేసుకుని చనిపోయినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి నేడు, ఆదివారం దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.
