సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: త‌మిళ‌నాడు కూనురు నీలగిరికొండ‌ల్లో ఆర్మీ హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలి కాలిపోయిన నేపథ్యంలో దాదాపు అందరు 90 శాతం కాలిన గాయాలతో 12 మంది మృత్యువాత పడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్‌ రావత్‌ సైతం నేటి , బుధవారం సాయంత్రం కన్నుమూశారు. రావత్‌తోపాటు ప్రయాణిస్తున్న ఆయన భార్య మధులిక కూడ ప్రమాదం జరిగిన వెంటనే కన్నుమూశారు. బిపిన్‌ రావత్‌ మరణాన్ని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ధృవీకరించింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ఉండగా.. 13 మంది మరణించారు. నిన్న మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ప్యానెక్స్‌ కర్టెన్‌ రైజర్‌ సమావేశంలో బిపిన్‌ రావత్‌ పాల్గొన్నారు. నేటి బుధవారం తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దీంతో భార్యతో పాటు కలిసి సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి అత్యదిక సౌకర్యాలు ఉన్న క్యారియర్‌ హెలికాప్టర్‌ ఎంఐ 17లోమరో పన్నెండు మంది ఆర్మీ అధికారులతో ఆయన వెల్లింగ్టన్‌కి బయలు దేరారు. నేటి,ఉదయం 11:48 నిమిషాలకు హెలికాప్టర్‌ సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి టేకాఫ్‌ అయ్యింది. నీలగిరి కొండల్లో విస్తరించిన దట్టమైన అడవుల గుండా ప్రయాణించి ఈ హెలికాప్టర్‌ వెల్లింగ్టన్‌ చేరుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఈ దుర్ఘటన జరగటం తో దేశ ప్రధాని మోడీ నుండి కేంద్ర నేతలు అందరు విస్మయం వ్యక్తం చేస్తూ , నేటి రాత్రి అత్యవసర సమావేశంలో ఈ దారుణ ఘటనపై సమీక్షించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *