సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశం యావత్తు చలించిపోయిన ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ప్రమాదంలో 13 మంది దేశ సేవలో వీరమరణం పొందగా ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనే శౌర్యచక్ర అవార్డు గ్రహీత, ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఐఏఎఫ్‌ ట్వీట్‌ చేసింది. వరుణ్‌ మంచి ధైర్యశాలి. వాయుసేనలో విశేష సేవలందించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌కు ఆయనే కెప్టెన్‌. గతంలో సాంకేతిక సమస్యలు ఎదురైనపుడు ఆయన వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. గతేడాది అక్టోబరులో ఆయన నడుపుతున్న ఎల్‌సీఏ తేజస్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ను సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం ఆయనను మూడో అత్యున్నత పురస్కారం శౌర్యచక్రతో సత్కరించింది. వరుణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని దేశం యావత్తు కోరుకొంటుంది. ప్రాణాలు అర్పించిన 13 యోధులకు వారి కుటుంబాలకు దేశం సెల్యూట్ చేస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *