సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ హ్యూమన్స్ రైట్స్ చైర్మన్ గా కీలక పదవిలో ఉన్న భీమవరం పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు పర్రిపాటి శ్రీనివాస్ తాజగా ఇంటర్ నేషనల్ ఆర్యవైశ్యఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. అని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోనా శ్రీనివాసరావు, గోంట్ల రామ్మోహనరావులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్య సమాజ ఐక్యత, గుర్తింపు, హక్కుల పరిరక్షణ కోసం కట్టుబడి పని చేస్తానని, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శుల మార్గదర్శకత్వంలో సమాజానికి ఉపయోగపడే నిర్ణయాలు, కార్యక్రమాలతో పని చేస్తానన్నారు. ఈ నియామకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సమాజంలో రాజకీయ అవగాహన, ప్రాతినిధ్యం సంఘబలం మరింతగా పెంచడానికి కృషి చేస్తాననని అన్నారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ గాను, వాసవి జాగృతి విజెఎఫ్ అధ్యక్షులుగాను, బాధ్యతలు నడుపుతున్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *