సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భారతీయ దర్శక ధీరుడు రాజమౌళి తో జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా హీరో రామ్‌చరణ్‌, అజయ్ దేవగన్ మల్టీస్టార్ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా చిత్రంగా రూపు దిద్దుకుంటున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. బిగ్‌ స్క్రీన్‌పై తెలుగు రాష్ట్రాలలో తొలిసారి నేడు, గురువారం ట్రైలర్ ప్రదర్శించారు. దీనికోసం హీరోల అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతాకాదు.. బాణాసంచాకాల్పులు, డప్పు మోతలు, భారీ ఫెక్సీలు ఎదో ఇప్పుడే సినిమా రిలీజ్ అయిన ఆనందం. . భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ సాంగ్స్‌, మేకింగ్‌ వీడియోలు ఫ్యాన్స్‌కు మంచి కిక్కు ఇవ్వగా, థియేటర్లలో రిలీజైన ట్రైలర్‌ మరింత హంగామా సృష్టిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం, రణం, రుధిరం) ట్రైలర్‌తో జక్కన్న సర్‌ప్రైజ్‌కి ఫ్యాన్స్‌ ఫిదా. గూస్‌ బంప్స్‌ వచ్చేస్తున్నాయని అభిమానులు సంబరపడుతున్నారు. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. దాదాపు మూడు గంటల ఆరు నిమిషాల 54 సెకన్ల నిడివితో ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి రాబోతోంది. దాదాపు రూ. 400 కోట్లతో ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *