సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దంత వైద్యం అతి సున్నితమైనదని, ఆధునిక టెక్నాలజీతో కూడిన దంత వైద్యం ప్రజలకు అందజేయాలనికేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు. భీమవరం జెపి రోడ్డు – రాయలం రోడ్డులో ఆల్ఫాస్ మల్టీస్పెషలిటీ డెంటల్ కేర్ను ఆదివారం ప్రారంభించారు. అత్యాధునిక పరికరాలతో మన ప్రాంతంలో డెంటల్ కేర్ ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.డాక్టర్ హర్షిత మాట్లాడుతూ.. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని, దంత సంరక్షణకు వైద్యుల సూచనలు ఎంతో అవసరమని అన్నారు. అత్యాధునిక పరికరాలతో ఆల్ఫా డెంటల్ ఆసుపత్రిని ప్రారంభించామని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ హర్షితను ప్రోత్సహిస్తున్న ఆమె భర్త సురేంద్ర , జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, పట్టణంలోని వైద్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *