సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆసియా క్రీడలలో తొలిసారి భారత్ క్రీడాకారులు చూపిస్తున్న ప్రతిభకు ప్రపంచదేశాలు అచ్చెరువు నొందుతున్నాయి. పారదర్శకంగా క్రీడాకారులను ఎంపిక చేసి పంపితే ఎలా ఉంటుందో? ఇప్పుడు నిరూపితమైయింది. చైనా వేదికగా చివరి అంఖంలో చేరిన ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇప్పటికే 25 స్వర్ణాలు 35 రజతాలు, 45 కాంస్యాలతో మొత్తం 100 పతకాలు అందించిన క్రీడాకారులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఓ ట్వీట్ లో.. ‘‘ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది అద్భుత విజయం. మనం 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన మన అసాధారణ క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. విస్మయం కలిగించే వారి ప్రదర్శన చరిత్ర సృష్టించింది. మన హృదయాలను గర్వంతో నింపింది. నేను 10వ తేదీన మన ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి, వారితో సంభాషించడానికి ఎదురుచూస్తున్నాను.’’ అని తెలిపారు.
