సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో నేడు, శనివారం భారత షూటర్ల హవా కొనసాగుతుంది. శుక్రవారం మన షూటర్లు మరో గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించారు. పురుషుల 50 మీటర్లఎయిర్ పిస్టల్ షూటింగ్ టీమ్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, కుసలే స్వప్నిల్, అఖిల్ షెయోరాన్తో కూడిన భారత బృందం స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అదే విధంగా 10 మీటర్లఎయిర్ పిస్టల్ మహిళల టీమ్ ఈవెంట్లో భారత్ సిల్వర్ మెడల్ కూడా సాధించింది. ఒక్క రైఫిల్ షూటింగ్ లోనే 4గోల్డ్ మెడల్స్ రావడం గమనార్హం.. మొత్తంగా భారత్ కు 7 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు ఈ చైనా లో ఆసియా గేమ్స్ లో 27 పతకాలతో భారత్ 4 స్థానం లో కొనసాగుతుంది.
