సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రపంచ సినీ పరిశ్రమ లో అత్యుత్తమ పునస్కారాలు గా భావించే ( నిజానికి హాలివుడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.) లో ఈసారి తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’, కూడా మంచి పోటీ ఇస్తుందని ప్రఖ్యాత వైబ్ సైట్ ప్రెడిక్ట్ ప్రకటిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా సుమారు 1200 కోట్లు వసూళ్లు చెయ్యడమేకాదు.. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’సినిమాను హాలీవుడ్ ప్రముఖులు ఒటిటి లో ఇంగ్లీష్ వెర్షన్ లో చూసి ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో కొమురం భీమ్‌గా నటించిన ఎన్టీఆర్ పేరు ఉత్తమ నటుడు కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్‌లో ఉండే అవకాశం ఉందని వెరైటీ ప్రెడిక్ట్ చేసింది. అంతేకాకుండా.. బెస్ట్ విదేశీ ఫిచర్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో ఎస్ఎస్ రాజమౌళి, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో ‘దోస్తీ’.. వంటి పలు విభాగాల్లో RRR ఆస్కార్‌కి నామినేట్ అయ్యే అవకాశం ఉందని వెరైటీ రాసుకొచ్చింది. తాజాగా ఉత్తమ నటుడు కేటగిరీలో రామ్‌చరణ్ పేరు కూడా ఉన్నట్లు ఆ వెబ్సైట్ రాసింది. దాంతో ఆయన అభిమానుల సంతోషానికి హద్దు లేకుండా పోయింది.ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’, ‘రోబో’ వంటి పాన్ ఇండియా చిత్రాలకి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్‌గా పనిచేసిన శ్రీనివాస్ మోహన్ ట్వీట్ చేశాడు. ఆస్కార్ అవార్డు మాట దేవుడెరుగు.. అసలు అవార్డు కేటగిరీలలో నామినేషన్ దొరికితేనే ప్రపంచ మీడియాలో అదో పెద్ద బిల్డప్ మరి.. ఆస్కార్ లో కూడా తెలుగు వాడు తగ్గేదే.. లే..
