సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గాను ఆస్కార్ అవార్డు లభించింది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ఆ పాట రాసిన రచయిత చంద్రబోస్ఇద్దరూ ఆస్కార్ వేదికమీదకి వెళ్లి ఈ అవార్డు అందుకున్నారు.. ఎందుకంటే, ఆ పాటని రాసింది, దానికి సంగీతం సమకూర్చింది వాళ్లిద్దరే కాబట్టి. నిజానికి ఒళ్ళు హూనం చేసుకొని ఆ పాటని కోరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ కి కూడా అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే అతనే కదా ఆ పాటని ఆలా రావటానికి తన శక్తి అంతా ధారపోసింది. ఈ పాటని జనాల్లోకి తీసుకు వెళ్ళింది ఆ పాట తీసిన రాజమౌళి అద్భుతంగ డాన్స్ చేసిన హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ పడ్డ కష్టం అంతాఇంతా కాదు.. పైగా తెలుగు సినిమా కు ఆస్కార్ గౌరవం దక్కాలని ,కేంద్ర ప్రభుత్వం ఆస్కార్ కు RRR ను నామినేట్ చెయ్యకపోయిన.. ఒక కసి తో, అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు లో ప్రదర్శనలు, అవార్డు పంక్షన్స్ లో పాల్గొని మరల అమెరికా వెళ్లి ఈ పాటని వరల్డ్ ఫ్యామస్ చేసిన ఘనత వీరి ముగ్గురికి దక్కుతుంది. ఆఖరికి హాలీవుడ్ ప్రముఖులు మధ్య తెలుగు సినిమా సత్తా చాటి భారత దేశం మీసం మెలివేసారు. నిజం గా వారి ముగ్గురి పేర్ల తో RRRఅనిపించారు.. (ఫై తాజా చిత్రంలో ఆస్కార్ కు హాజరైన ముగ్గురు ముగ్గురే.. )
