సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ సినిమా పండుగలో అగ్రగామి గా భావించే 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా జరిగింది. . భారత కాలమానం ప్రకారం నేటి సోమవారం ఉదయం ఐదు గంటలకు వేడుక ప్రారంభం అయింది. 10 న్నర గంటలకు ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయులు, తెలుగు ప్రజల ఆస్కార్ కలలను నిజం చేస్తూ అంతర్జాతీయ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్’సత్తా చాటింది.సంగీత దర్శకుడు కీరవాణి, ఆ పాటని రాసిన చంద్రబోస్ ఆస్కార్ అవార్డు అందుకోవటానికి వేదిక మీదకి వెళ్లారు.ఈ సంతోష సమయంలో రాజమౌళి, జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమా యూనిట్ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అయితే ఆస్కార్ వేడుకలు ప్రారంభోత్సవంగా ఆస్కార్ వేదికపై తెలుగు పాట ‘నాటు నాటు’పాటకు హాలీవుడ్ డ్యాన్సర్లు చిందులేసి వీక్షకులను ఉర్రూతలూగించారు. ఈ పాట ప్రదర్శించిన సందర్భంలోవివిధ దేశాల నుండి వచ్చిన సినీ ప్రముఖులు , ఆహుతులు కేరింతలతో ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ జరుగుతున్న డాల్బీ థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. పాట ఆఖరున స్టాండింగ్ హానర్ ఇవ్వడం తో తెలుగు సినిమా కు దక్కిన గౌరవం కు పొంగిపోని భారతీయుడు ఎవరు ఉంటారు?ఇప్పటికే పలు విభాగాల్లో ‘ఆస్కార్’ అవార్డులను ప్రకటించారు. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్‌గా ‘యాన్ ఐరిష్ గుడ్‌బై’ ఆస్కార్ దక్కించుకుంది. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో జేమ్స్ ఫ్రెండ్‌ను ఆస్కార్ వరించింది
