సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆస్ట్రేలియా లో సిడ్నీ లో జరిగిన 67 వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ లో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు అడ్జక్షాటన బృందం పాల్గొంది. కామన్వెల్త్ దేశాల ప్రజా ప్రతినిధులతో తమ తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. వేదికపై మోషేను రాజు మన దేశం మరియు రాష్ట్ర సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వారి కుమరుడు కొయ్యే సుందర్ రాజు కూడా పాల్గొన్నారు.. నేటి గురువారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. ఇది భీమవరం తరపున, ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, దేశం తరపున తనకు దక్కిన అరుదయిన గౌరవంగా మోషేను రాజు వ్యాఖ్యానించారు. ఇంకా జపాన్ తదితర దేశాలలో కూడా ఆంధ్రప్రదేశ్ తరపున పర్యటించి ఈనెల 16వ తేదీన భీమవరం రానున్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో AP స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా పాల్గొన్నారు.
