సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రాజమహేంద్రవరంలో నిర్వహించిన నేపథ్యంలో .ఈ వేడుకకు హాజరు అయ్యి తిరిగివెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన మణికంఠ(23), తోకాడ చరణ్(22) అనే ఇద్దరు యువకులు మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి ఒకొక్క యువకుని కుటుంబానికి 5 లక్షల చప్పున ఆర్ధిక సహాయం ప్రకటించిన విషయం విదితమే..కాగా, ఘటన గురించి తెలుసుకొన్న హీరో రామ్‌చరణ్ తన మనుషులను మృతుల కుటుంబ సభ్యుల వద్దకు పంపించారు. ఆ రెండు కుటుంబాలకు చెరొక రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. నిర్మాత దిల్ రాజు కూడా రెండు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించారు. (అంటే ఒకొక్క యువకుని కుటుంబానికి మొత్తంగా 15 లక్షలు..) అంది వచ్చిన కొడుకులు ను పోగొట్టుకొన్న ఆ కుటుంబాలలో విషాదం ఎవరు తీర్చలేనిది.
