సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల కందుకూరు, గుంటూరు దారుణ ఘటనలు తరువాత కుప్పం లో పోలీసులు తన రోడ్డు షో ను అడ్డుకొని వ్యాను దింపెయ్యడంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి గురిఅవుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ఫై కూర్చుని నిరసన కూడా చెప్పటారు. తాజగా పరిస్థితులను ఆకళింపు చేసుకొని తాజాగా మీడియా సమావేశంలో జగన్ సర్కార్ ఫై ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు మాటలలో.. మొన్న కుప్పంలో నా సభ అడ్డుకోవడానికి రెండు వేల మంది పోలీసులు వచ్చారు. నేనేమన్నా తీవ్రవాదినా? అండర్ గ్రౌండ్ నక్స లైటునా? మా వాళ్లపై దాడి చేసి తిరిగి వారిపైనే కేసులు పెడతారా? మీరేం చేసినా జరిగిపోతుం దనుకుం టున్నారు. నా సొంత నియోజకవర్గమైన కుప్పం లో నా పర్యటనను అడ్డుకునేందుకు రెండు వేల మంది పోలీసులు వచ్చారు.. కందుకూరులో కనీసం 20 మంది రాలేదు. ఇందుకు పోలీసులకు సిగ్గనిపించట్లేదా? అక్క డ కుట్ర చేసి ప్రజలను చంపేసి.. తిరిగి నా మీదే కేసులు పెడుతున్నారు’ అని తీవ్రస్థాయిలో ఆరోపిం చారు. మొన్న గుంటూరు లో ప్రవాసాంధ్రుడు ప్రజలకు 5 కోట్ల రూపాయలు కానుకలు ఇవ్వాలని వస్తే నిజానికి కానుకలు పంచేటప్పుడు తొక్కిసలాట జరిగితే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిం చారు. ముగ్గురు చనిపోతే ఒక్కొక కుటుంబానికి 25 లక్షలు ఇచ్చిన సరే.. అతనిదే బాధ్యత అని NRI ని అరెస్ట్ చేసారు. నిజానికి ఇది పోలీసుల తప్పు కాదని, పై నుంచి ఆదేశాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. పులివెందుల రౌడీ.. నీ రౌడీయిజానికి ఎవరూ భయపడరు. వివేకానందరెడ్డి హత్య కేసులో నీ చెల్లి రాజీలేని పోరాటం చేస్తోంది. ఇందులో నీ తమ్ము డికి, నీకు తప్పకుండా శిక్షపడుతుంది’ అని సీఎం జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *