సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో భీమవరం నియోజకవర్గంలో అనేక వేలమంది పేదల కుటుంబాలకు నా హయాంలో సొంతింటి కలను నిజం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు మున్సిపాలిటీ, హౌసింగ్ అధికారులతో నేడు, శనివారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణాలపై సమీక్ష జరిపారు. పేదల గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తీ అయ్యేలా అధికారులు సహకరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను 2004 నుండి 5ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో అనేక మంది పేదల సొంతింటి కలలను భీమవరంలో నిజం చేయడం జరిగిందన్నారు. ఆనాడు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను మంజూరు చేసి పట్టాలు ఇచ్చి గృహ నిర్మాణాలు చేయడం జరిగిందని అన్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన పాలకులు గాని, గత చంద్రబాబు పాలనలో గాని పేదలకు ఒక్క సెంటు స్థలం ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. అయితే 2019 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి ప్రాధాన్యత పేదల సొంతింటి కలకు ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 లక్షల మందికి పైగానే పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, లబ్ధిదారులకు పట్టాలిచ్చి మొదటి విడత గా లక్ష ఇళ్ళు నిర్మాణాలు పూర్తీ చెయ్యడం హర్షణీయం అన్నారు.
