సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తిరుమలలో క్రైస్తవ పెద్దలు ను వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో ఉంది.( ఈవో కుమారుడు చనిపోతే దహనం చేయలేదని.. ఖననం చేశారని అన్నారు ) అయితే ఆ వీడియోపై తాజాగా రమణ దీక్షితులు స్పందించారు. టీటీడీ ఈవోకు లేఖ రాశారు. ఆ వీడియోలో ఉన్నది తన గొంతు కాదని ఎవరో తన వీడియోకు టెకనాలజి సాయంతో వాయిస్ మాపింగ్ చేసారని పేర్కొన్నారు.తనపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు పిర్యాదు చేసిన . భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌ను కూడా ఎప్పుడు కలవలేదని తెలిపారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా.. ఈవోకీ వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడలేదన్నారు. టీటీడీతో ఉన్న సంబంధాలతో పాటు తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఆ వీడియో ఉందన్నారు. ఈ అంశంపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని రమణ దీక్షితులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *