సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశవ్యాప్తంగా తెలుగు సినిమా సాధిస్తున్న వరుస ఘన విజయాలు నేపథ్యంలో ఇకపై తెలుగు హిందీ నటుల కలయికతో సినిమాలు నిర్మాణం అవుతున్నాయి. దానిలో భాగంగా బాలీవుడ్ ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్ హీరోలుగా మల్టీ స్టార్ కాంబినేషన్ తో నటిస్తున్న ‘కిసీ కా భాయ్ కిసీ’ చిత్రం ఒకటి. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ని అందుకుని అంచనాలను భారీగా పెంచేసింది. అలాగే.. గత నెలలోనే ఈ యాక్షన్ చిత్రం టైటిల్ లోగోని కూడా మూవీటీం ఆవిష్కరించింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌తో పాటు టాలీవుడ్ నటుడు వెంకటేష్ దగ్గుబాటి, పూజా హెగ్డే, జగపతి బాబు, షెహనాజ్ గిల్, రాఘవ్ జుయాల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.అంతేకాకుండా ఈ మూవీలో సరికొత్త ఫ్లాష్ న్యూస్ ఏమిటంటే రామ్ చరణ్ అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్నే ధృవీకరించారు. నాతో, వెంకీతో కలిసి ఒకే ఫ్రేమ్ ఉన్న కొన్ని కీలక సన్నివేశాలలో నటిస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ మూవీని సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్లో సల్మాన్ ఖానే స్వయంగా తెరకెక్కిస్తున్నాడు. కాగా.. ఈ సినిమా 2022 డిసెంబర్ లో విడుదల కానుంది.
