సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు నేడు, గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలలో తన వాస్తవ సమాచారాన్ని ప్రజల వద్దకు చేరవేసి తన విజయానికి వారధిగా నిలచిన మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. వారికీ ఎప్పుడూ జవాబుదారిగానే ఉంటామని తెలిపారు. నిన్న ఢిల్లీలో విజయసాయి రెడ్డి పెడబొబ్బలు పెడుతూ రాష్ట్రంలో ఒకటి, అర సంఘటనలు జరిగితే వాటిని వైసీపీ ఫై దాడులుగా రాష్ట్రపతి కి పిర్యాదు చెయ్యడం ను ఎద్దేవా చేసారు. సాక్షత్తు ఎంపీ గా ఉన్న తనను పక్క రాష్ట్రము నుండి పోలిసుల సహాయంతో ఎత్తుకొని వచ్చి చిత్ర హింసలు పెట్టిన ఉదంతం గుర్తు చేసారు. దొంగే దొంగా దొంగ అన్నట్లుగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలలో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గురించి ఇకపై వ్యక్తిగతంగా నేనేమి మాట్లాడ దల్చుకోలేదని.. ఇప్పుడు ప్రజలు గమనించేది మేము ఏమి చేస్తామని మాత్రమేనని.. గత 2019ఎన్నికల్లో టిడిపికి 40% ఓట్లు పోల్ కాగా, ఈసారి జగన్మోహన్ రెడ్డికి కూడా40 శాతం ఓట్లు వచ్చాయని అయితే సీట్లు తగ్గాయని పేర్కొన్నారు. ప్రధాన పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసం ఎప్పుడు 20% మాత్రమేనని , ఆ 20 శాతం తటస్థ ఓటర్లే ఇంపార్టెంట్. వారే ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తారు.రాష్ట్రంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే నా కోరిక అన్నారు. ఇటీవల ఇక్కడ పాతాళ మరక గ్రామాన్ని చూశానని, అక్కడ శివ వర్మ స్వంత డబ్బు తో అభివృద్ధి చేసిన తీరు నాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. స్థానిక మంచినీటి చెరువు, స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తూ పరిశుభ్రంగా ఉంటుందన్నారు. శివ వర్మ స్ఫూర్తితో ప్రతి గ్రామంలో ఐదుగురు శివవర్మలు ముందుకు వస్తే ఉండి నియోజకవర్గం మొత్తాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దవచ్చునన్నారు. రఘురామా కృష్ణంరాజు
