సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో రూ.2000 నోట్లను మార్చుకునే లేదా డిపాజిట్ చేసుకునే సదుపాయం ఏప్రిల్ 1న సోమవారం అందుబాటులో ఉండదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అయితే ఏప్రిల్ 2 నుంచి అంటే వచ్చే మంగళవారం నుంచి మళ్లీ యదావిధిగా కొనసాగనుంది.మీరు నేరుగా RBI ఇష్యూ కార్యా లయానికి వెళ్లి మీ బ్యాంక్ ఖాతాలో రూ.2000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు. లేదా.. ఏదైనా స్థానిక పోస్టాఫీసు నుండి ఏదైనా RBI ఇష్యూ కార్యాలయానికి ఇం డియా పోస్ట్ ద్వారా పంపవచ్చు. గత ఏడాది మే 19న సెంట్రల్ బ్యాంక్ రూ.2000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. RBI ప్రకారం ,ఫిబ్రవరి 29న ఆర్ధిక లావాదేవీలు వ్యాపారం ముగిసే సమయానికి రూ.2,000 నోట్లలో 97.62 శాతం ఇప్పటికే బ్యాంకింగ్ వ్య వస్థకు తిరిగి వచ్చాయి. కేవలం రూ. 8,470 కోట్ల విలువైన ఉపసంహరణ నోట్లుమాత్రమే ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి.
