సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ మంత్రిత్వ, ఐసోలేటెడ్ పోస్టులలో 1000 కి పైగా ఖాళీలను భర్తీ చెయ్యడానికి అభ్యర్థుల ఆన్‌లైన్ దరఖాస్తు కోసం చివరి తేదీని పొడిగించింది. ఇంటర్, డిగ్రీ అర్హత, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక డ్రైవ్ ద్వారా జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, చీఫ్ లా అసిస్టెంట్, కుక్, PGT, TGT, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ (పురుషలు, స్త్రీలు), అసిస్టెంట్ మిస్ట్రెస్ (జూనియర్ స్కూల్, మ్యూజిక్ మిస్ట్రెస్, డ్యాన్స్ మిస్ట్రెస్, లాబొరేటరీ అసిస్టెంట్ (స్కూల్), హెడ్ కుక్ , ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్ వంటి పోస్టులు 1036 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి నిర్దిష్ట పదవిని బట్టి మారుతుంది. కొన్ని పోస్టులకు గరిష్ట పరిమితి 48 సంవత్సరాలు.. ఈ పోస్టులకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. దివ్యాంగులు/మహిళలు/ట్రాన్స్‌జెండర్లు/మాజీ సర్వీస్‌మెన్ అభ్యర్థులు/ షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగలు/మైనారిటీ సమాజం/ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC) కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ. 250 రుసుము చెల్లించాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 16, 2025 లోపు బోర్డు అధికారిక వెబ్‌సైట్ (rrbapply.gov.in) ని సందర్శించి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫిబ్రవరి 19, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు తమ దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు చేసుకోవచ్చు.
