సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే ఏప్రిల్ నెలలో ఏపీలో ఎన్నికల నిర్వహణ కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశం తో ఇంటర్ తో పాటు పదో తరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు పేర్కొంటూ.. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు గురువారం మధ్యాహ్నాం విజయవాడలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు.”టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది(టెన్త్లో 6 లక్షలు, ఇంటర్లో10 లక్షలు) మంది పరీక్షలు రాయబోతున్నా రు. వచ్చే మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలుజరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12గం .45ని. వరకు పరీక్షల సమయంగా కేటాయించాము. ..అలాగే మార్చి 1 నుం చి 15వ తేదీ వరకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. అలాగే మార్చి 2వ తేదీ నుండి మర్చి 21వరకు ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తాము. విద్యార్థులందరూ పాసై 100 శాతం సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నాం ’’ అని మంత్రి బొత్స అన్నారు.
