సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో విషాదకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ముగ్గురు విద్యార్థులు తీవ్ర మనోవేదనతో క్షణిక ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. విశాఖపట్నం జిల్లా కొండపేటకు చెందిన చరణ్ తేజకు సెకండియర్ ఫిజిక్స్‌లో కేవలం 10 మార్కులే రావడంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఇదిలా ఉంటే …నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలో ఫస్ట్ ఇయర్‌లో ఫెయిలైన చిన్న మస్తాన్ అనే విద్యార్థి కూడా జీవితాన్ని అర్థారతంరంగా ముగించుకున్నాడు. నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం ప్రాంతంలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలులో విద్యార్థుల మానసిక ఒత్తిడిని గమనించక, తెలిసినవారు తల్లి తండ్రుల నుండి వచ్చే నిరాదరణ, ఎవరు మనోనిబ్బరం కలిగించే మాటలు చెప్పకపోవడంతో ఆ చిన్నారుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసాయి. ఇంకా కర్నూలు జిల్లా ఆదోనిలో ఇద్దరు సబ్జెక్టుల్లో ఫెయిలైన ఓ బాలిక ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఇంటర్ పాస్ కాకుండా అద్భుతాలు చేసి అత్యున్నత స్థాయికి చేరిన వ్యక్తులు ఎన్ని లక్షల మంది లేరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *