సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఏ మాత్రం నిరాశపడకుండా సప్లిమెంటరీ పరీక్షలుకు సిద్ధం కావలసి ఉంది. ప్రభుత్వం ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో మే 12 నుంచి 20 వరకు నిర్వహించనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ థియరీ, 28 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు.అలాగే ఇటీవల విడుదల అయినా రెగ్యులర్ పరీక్షల ఫలితాలకు సంబంధించి వచ్చిన మార్కుల పట్ల ఎవరికైనా సందేహాలు ఉంటె రీ కౌంటింగ్ కోరుకునే విద్యార్థులు పేపర్‌కు రూ.260, రీవెరిఫికేషన్‌కు రూ.1,300 చొప్పున చెల్లించి వారు చదువుతున్న కళా శాల నుంచే దరఖాస్తు చేసుకోవాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షార్థులు ఈ నెల 15నుంచి 22లోగా థియరీ పరీక్షలకు రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275లను తమ కళాశాలలో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఎంపిక చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 15 నుంచి అన్ని కళాశాలల్లో రెమిడియల్ క్లాసు లను ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చెయ్యనున్నారు.
