సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం అసెంబ్లీ లో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై కీలక ప్రకటన చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని తప్పకుండా అమలు చేసి తీరుతామని . తల్లికి వందనం పథకాన్ని వచ్చే మే నెలలో అమలు చేస్తామని ప్రకటించారు. . ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. పథకాన్ని అమలు చేస్తామన్నారు. మే నెలలో ఈ పథకం డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే రైతుకు భరోసా క్రింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు సీఎం. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి యోజన రూ. 6000, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 14 వేలు కలిపి మొత్తం రూ. 20వేలు ఇస్తామన్నారు. ఇక దివ్యాంగులకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేలు పింఛను పెంచామన్నారు. సాధారణ పింఛన్‌ను రూ. 3 వేల నుంచి 4 వేలకు పెంచామన్నారు.అన్న క్యాంటీన్ లను తిరిగి తెరిపించామన్నారు. రూ. 33 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పింఛన్లు ఇచ్చే దేశంలోనే ఏకైక కార్యక్రమం ఇది అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా గవర్నమెంట్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అందరికీ సమయానికి జీతాలు ఇస్తున్నామని, ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
