సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే నిరుద్యోగ యువతకు శుభవార్త!. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంకు వివిధ కేటగిరీల్లో 171 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా పలు బ్రాంచుల్లో స్కేల్ 1, 2, 3, 4లలో వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో సీఏ, సీడబ్ల్యూఏ, ఐసీడబ్ల్యూఏ, ఐసీఏఐ, పీజీ, బీఈ/ బీటెక్, ఎంసీఏ, ఎంసీఏ/ ఎంఎస్సీ, డిగ్రీ, ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడీబీఎం, ఎల్ఎల్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి పోస్టులను అనుసరించి 23 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అర్హత గలవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 13లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్, ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఆకర్షణీయ (లక్ష రూపాయలు వరకు) జీతంతో పాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు.
