సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2.0 కార్యక్రమంలో భాగంగా నేడు, శనివారం భీమవరం పురపాలక సంఘం నందు రెండు ప్రదేశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది 1. రైల్వే అండర్ టర్నల్ బ్రిడ్జ్ 2వ వార్డు,వద్ద మున్సిపల్ ఎయిడెడ్ హై స్కూల్ విద్యార్థులచే రైల్వే అండర్ టర్నల్ కు ఇరువైపులా వాల్ పెయింటింగ్స్ వేయించడం జరిగింది.2. ఇండియన్ స్వచ్ఛతలి కార్యక్రమంలో భాగంగా గునుపూడి సోమేశ్వర స్వామి వారి దేవస్థానం పరిధిలో గల సోమగుండం చెరువు చుట్టూ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించుటకు, శుభ్రత పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రెండు కార్యక్రమాలలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, సానిటరీ ఇన్స్పెక్టర్ వేండ్ర ప్రసాద్ , ASO కె రాజు, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు , మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ బి ఆదినారాయణ, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది, వార్డు శానిటేషన్ సెక్రటరీలు మరియు ఇతర సచివాలయ సిబ్బంది USM స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *