సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఏడు రాష్ట్రాల్లోని ఇటీవల జరిగిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలలో గత శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ‘ఇండియా’ కూటమి 10 స్థానాల్లో విజయకేతనం ( బీజేపీ 2 ఇండిపెండెంట్ 1 గెలిచారు) ఎగురవేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఏడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ అల్లిన భయం, గందరగోళం బద్దలయ్యాయని అన్నారు. రైతులు, యువకులు, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరూ నియంతృత్వాన్ని పూర్తిగా అంతమొందించి న్యాయపాలనను కోరుకుంటున్నారని, ప్రజలు మెరుగైన జీవితాలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమికి బాసటగా నిలబడుతున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు దేశంలో బీజేపీ పాలనకు ప్రమాద గంటికలు మ్రోగిస్తున్నాయని పలువురు ఇండియా కూటమి నేతలు సీఎం లు వ్యాఖ్యానించారు.
