సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ప్రస్తుతం 230 మిలియన్ టన్నులు ఉన్న ఉక్కు ఉత్పత్తిని 2030 నాటికి 300 మిలియన్ టన్నులకు పెంచే లక్ష్యంగా ఉక్కు రంగంలో ఆత్మనిర్భర్ భారత్ కు వేగంగా అడుగులు పడుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఉక్కు మంత్రిత్వ శాఖ మరియు FICCI సంయుక్తంగా మూడు రోజులు పాటు నిర్వహిస్తున్న ఇండియా స్టీల్ ఆరో ఎడిషన్ ను ముంబైలో గురువారం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ప్రారంభించిన అనంతరం జిందాల్, జే ఎస్ డబ్ల్యు, చిన్న పరిశ్రమలు, మైక్రో స్టార్ట్ అప్ కంపెనీలు తదితర స్టాల్స్ ను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తోపాటు అధికారులు సందర్శించారు. దేశ, విదేశాల నుండి పెద్ద సంఖ్యలో ఉక్కు రంగానికి చెందిన ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
