సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇండోనేసియాలోని జావా ద్వీపం లో వచ్చిన భారీ భూకంపం ( 6.9) ధాటికి భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించింది. కొండచరియలు విరిగిపడ్డాయి. భవంతులు కూలిన ఘటనల్లో మొత్తంగా 162 మంది ప్రాణాలు కోల్పోయారని పశ్చిమ జావా గవర్నర్ రిద్వాన్ కమిల్ చెప్పారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని గవర్నర్ అన్నారు. మృతుల్లోఎక్కువ మంది చిన్నారులే ఉండటం గమనార్హం. సియాంజుర్ పట్టణంలో ఇస్లామిక్ బోర్డింగ్ స్కూళ్లు, మసీదులు ఎక్కువ. ఇక్కడి ఇస్లామిక్ స్కూళ్లలో డే క్లాసులు పూర్తయ్యాక అదనపు క్లాసుల కోసం చాలా మంది విద్యార్థులు స్కూళ్లలోనే ఉండిపోయారు. అదేసమయంలో భూకంపం రావడంతో పాఠశాల భవంతులు కూలి ఎక్కువ మంది చిన్నారులు మరణించడం పెద్ద విషాదం.
