సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజుకు చేరుకున్నాయి. సభ మొదలవగానే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. రఘురామకృష్ణం రాజు సభను గతానికి బిన్నంగా ప్రజా సమస్యలపై ప్రశ్నలతో పాటు మంచి హుషారుగా ఛలోక్తులతో నడిపిస్తున్నారు. నేడు, మంగళవారం చేనేత కార్మికుల సమస్యలను నెల్లిమర్ల ఎమ్మెల్యే వివరించిన తీరుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అభినందించారు. ఈ నేపథ్యంలో చేనేత సమస్యలపైన జనసేనకు చెందిన నెల్లిమర్ల లోకం మాధవి ప్రశ్నల వర్షం కురిపించారు. నెలలో ఒక్క రోజు ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించేందుకు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని ఎమ్మెల్యే ప్రశ్నించగా…వెంటనే ఉప సభాపతి రఘురామా ఆ ఎమ్మెల్యే నుద్దేశించి‘‘ఇంతకీ మీరు ధరించింది చేనేత చీర లేదా వేరే చీరనా’’ అని ప్రశ్నించారు. దీంతో ఒక్క క్షణం షాక్ అయిన ఎమ్మెల్యే మాధవి వెంటనే తేరుకొని .. అవును నేను చేనేత చీర ధరించానని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. సభలో నవ్వులు పూసాయి
