సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో నేటి గురువారం ఉదయం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి 216 కోట్ల రూపాయలతో మహిమానిత శ్రీ కనక దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి నుదుట కుంకుమ బొట్టు పెట్టి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో కోలాటాల నడుమ మంత్రి కొట్టు సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, చైర్మన్ కర్నాట రాంబాబు, ఆలయ అధికారులు పూర్ణకుంభతో స్వాగతం పలికారు. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణానికి రూ. 5.60 కోట్లు, రాజగోపురం ముందు భాగాన మెట్ల నిర్మాణంకు రూ. 15 కోట్లు, మహామండపం వద్ద అదనపు క్యూలైన్ల కోసం రూ. 23.50 కోట్లు, మల్లికార్జున మహామండపం క్యూ కాంప్లెక్స్ మార్చుటకు రూ. 18.30 కోట్లు, నూతన కేశఖండనశాల నిర్మాణం నిమిత్తం రూ. 19 కోట్లు, గోశాల అభివృద్ధి నిమిత్తం రూ. 10 కోట్లు, కనకదుర్గనగర్లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిమిత్తం రూ. 33 కోట్లు ఇంకా పలు నిర్మాణాలకు నిధులు కేటాయించారు.ఇంద్రకీలాద్రిపై కొండ రక్షణ చర్యలపనుల నిమిత్తం రూ. 4.25 కోట్లు, 2016 కృష్ణ పుష్కరాల సమయంలో గత ప్రభుత్వం హయాంలో కూల్చివేసిన పలువురు దేవుళ్ళ ఆలయాల పునర్నిర్మాణంకు రూ 3.87 కోట్లు కేటాయించడం గమనార్హం..
