సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో దుర్గామాత భక్తులకు పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న విజయవాడ ఇంద్ర కీలాద్రి ఫై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో లో ప్రసాదాల తయారీ కోసం వినియోగించే సరకుల్లో నాణ్యత లేదంటూ చాలా కాలంగా భక్తుల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నా ఆలయ అధికారులు పట్టించుకోవడంలేదని భావిస్తున్న నేపథ్యంలో ఆలయ ధర్మ కర్తల మండలి చైర్మెన్, కర్నాటి రాంబాబు, ఇతర సభ్యులు స్వయంగా రంగంలోకి దిగి ప్రసాదాల తయారీ కేంద్రంలో ప్రసాదాలుకు వాడుతున్న సరుకులు పరిశీలించి కాంట్రాక్టర్ అందిస్తున్న ముడి సరుకులపై ఆక్షేపణ వ్యక్తం చెయ్యడం జరిగింది. ‘పులిహోర కు వాడుతున్న బియ్యం నోట్లో వేసుకుంటే సుద్దలా ఉంది.. జీడి పప్పు , క్రిస్మిస్ , వేరుశనగ పప్పు రెండో రకమే, చింతపండులో పిక్కలు రాళ్లు చూడండి…, అంటూ కొందరు పాలక మండలి సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రసాదాల విభాగం లోని సిబ్బందిని పాలక మండలి ఛైర్మన్ నిలదీయగా.. వాటితో తమకు సంబంధంలేదంటూ అంత కాంట్రాక్టర్ ఇచ్చిన సరుకులతో ప్రసాదాలు చెయ్యడం తమ పని అని చెప్పడం గమనార్హం. ఇటీవల విజిలెన్స్ అధికారుల దర్యాప్తు లేకనే ఇలా జరుగుతుందని.. దీనిని నెలకు కోటి రూపాయలు పైగా సరుకులకు బిల్లులు చెల్లిస్తున్న అధికార సిబ్బంది, ఇఓ దృష్టికి తీసుకొనివెళతామని పాలకవర్గం ప్రకటించింది. రాష్ట్రంలోనే తిరుమల తరువాత రెండో పెద్ద దేవాలయమైన దుర్గగుడి ప్రసాదాల నాణ్యత ను పెంచే పనిలో ఇకపై రాజీపడబోమన్నారు.
