సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగువారికి సుపరిచితులు ప్రముఖ ఇంద్రజాలికుడు బీవీ పట్టాభిరామ్ మరణించారు. నేడు, మంగళవారం హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌లోని స్వగృహంలో ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. ప్రజల మానసిక సమస్యలు తొలగించే హిప్నాటిస్టుగా ఆయన పేరు పొందారు. రేపు , బుధవారం ఉదయం 9 గంటలకు స్వగృహం వద్ద అభిమానుల సందర్శనార్థం పట్టాభిరామ్ పార్థీవదేహాన్ని ఉంచుతారు. ఆయన మానసిక వికాసంపై, మేజిక్ ట్రిక్స్, మూఢనమ్మకాల నిర్ములనకు ఆయన పలు పుస్తకాలు రాశారు. ‘రెండు రెళ్ళు ఆరు’ వంటి కొద్దీ సినిమాలలో ప్రత్యక పాత్రలలో ప్రేక్షకులను నవ్వులు పూయించారు. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు.
