సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సాక్షత్తు శ్రీ కనక దుర్గ అమ్మవారు స్వయంగా బెజవాడ నగరంపై బంగారు వర్షం కురిపించి ఇక్కడే వెలిశారని పురాణాలలో పేర్కొన్న విజయవాడలోని ఇంద్ర కీలాద్రి ఫై శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సీఎం జగన్ శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున పసుపు,కుంకుమల, గాజులను ను పట్టువస్త్రాలను,సమర్పించారు. సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. దుర్గమ్మ సన్నిధానంలో వేద ఆశీర్వచనంతో పాటు అమ్మవారి తీర్ధ, ప్రసాదాలు, చిత్రపటం అందించారు.ఈ కార్యక్రమంలో అర్చకులు, ఉపముఖ్యమంత్రి (దేవాదాయ, ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం ఈవో డి భ్రమరాంబ.హోంశాఖ మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *