సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేటి మంగళవారం ఉదయం చేరుకొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆరోపిస్తూ.. పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన దుర్గమ్మ ఆలయం లోపల ఆలయం మెట్లను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ మెట్లకు పసుపు కుంకుమ కూడా పెట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు దేవదాయ శాఖ కమిషనర్, ఈవో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్ చిన్ని, బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సమయంలో పవన్ మీడియా తో మాట్లాడుతు.. వైసీపీ హయాంలో లడ్డు కలుషితం అయ్యిందని మేము అంటుంటే.. వారి నేతలలో అహకారం తగ్గలేదని ఎదురుదాడికి దిగుతున్నారని..టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న తిరుమలలో ప్రమాణం పేరిట హైడ్రామా చేశారని దుయ్యబట్టారు. శ్రీవారి లడ్డూ అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాశ్ రాజ్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. సెక్యూలరిజం అంటే రెండు మార్గాలని, ప్రకాశ్ రాజు వాటి గురించి తెసుకున్న తర్వాత మాట్లాడాలని సూచించారు. తమిళ్ హీరో కార్తీ తిరుమల లడ్డు ఫై.. అది సెన్సిటివ్ ఇష్యు అని వ్యాఖ్యానించడాన్ని తప్పు పట్టారు.. పవిత్ర మైన లడ్డు ఫై వ్యాఖ్యానించేటప్పుడు అలోచించి మాట్లాడాలని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *