సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు, శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఉజ్వల యోజన కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. దాని కోసం రూ.12,060 కోట్లు కేటాయించారు. అసోం, త్రిపుర రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీకి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రూ.7,250 కోట్ల చొప్పున ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. సాంకేతిక విద్య కోసం రూ.4,200 కోట్లు ప్రకటించినట్లు కేంద్రం ప్రకటించింది.ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల అప్‌గ్రేడ్‌కు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటిచింది. దేశీయ LPGలో నష్టాలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు పరిహారం చెల్లించేందుకు రూ.30,000 కోట్లు కేటాయించినట్లు వివరించింది.. అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఫై విధించిన 50 శాతం సుంకాలపై కేబినెట్‌‌లో చర్చ జరిగింది. అమెరికా సుంకాలకు భారత్‌ దీటైన కౌంటర్‌ గా ఇకపై అమెరికా నుంచి 3న్నర బిలియన్ డాలర్స్ ఇచ్చి ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేసినట్లు భారత్ ప్రకటించింది. ఇప్పటికే అమెరికా క్షిపణుల కొనుగోళ్లు నిలిపివేసినట్లు భారత్‌ తెలిపింది. ఇకపై చమురు తో పాటు ఆయుధాలు కూడా రష్యా నుండే భారత్ దిగుమతి చేసుకొనే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *