సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీశైల శిఖర దర్శనం చేసుకొంటే చాలు పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. మరి పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త తెలిపింది. తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకునేవారికి శ్రీశైలం ఆలయంలో దర్శన టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై రోజూ 1,200 దర్శన టికెట్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 200 భక్తులకు స్పర్శ దర్శనం, 500 అతి శీఘ్రదర్శనం ,మరో 500 శీఘ్ర దర్శనం టికెట్లు కేటాయించారు. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం , ఆర్టీసీ మధ్య ఒప్పందం చేసుకొంది. ప్రతి రోజూ 1,200 దర్శన టికెట్లు ప్రయాణికులకు కేటాయించారు.ఇది అతి త్వరలో అమల్లోకి రానుంది. ఆర్టీసీ టికెట్ తో పాటు మల్లన్న లింగాన్ని తాకేందుకు స్పర్శదర్శనం టికెట్ ధర రూ.500, అతి శీఘ్రదర్శనం రూ.300, శీఘ్రదర్శనం టికెట్ ధర రూ.150 ఉంటుందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. వచ్చే మార్చి నెల మొదటి వారం నుండి శివరాత్రి మహోత్సవాలు నేపథ్యంలో ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక బస్సులు ఏర్పాటు చేసింది.
