సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సరికొత్త సంస్కరణలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీల్లో వసూలు చేసే పన్నులు ఎక్కడికక్కడ వినియోగించుకునే విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించారు. ఇకపై మునిసిపాలిటీలకు వచ్చే ఆదాయాన్ని స్థానిక పట్టణాల అభివృద్ధి కి చేందేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా మునిసిపాలిటీ ,రుడా పరిధిలో భవనాలు, లేఅవుట్లకు అనుమతులు త్వరితగతిన జారీ చేస్తామన్నారు.ఐదు అంతస్తులు, 15 మీటర్ల ఎత్తులో నిర్మించే భవనాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అనుమతులన్నీ చాలా సులభతరం చేశామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల టీడీఆర్ స్కామ్ జరిగిందన్నారు. దీనిపై విచారణ జరుగుతుందన్నారు
