సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ‘చుక్కల భూములకు’ శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్న లకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారు. ఈ కార్యక్రమాన్ని నేడు, శుక్రవారం నెల్లూరు జిల్లా కావలిలో సీఎం ప్రారంభిం చారు. బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, ‘‘రైతన్న ల కష్టం నేను చూశాను.. మీకు నేను ఉన్నాను. ఇప్పటికే గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేశాం . గతం లో అవనిగడ్డ నియోజకవర్గం లో రైతుల సమస్యలను పరిష్కరించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా భూసర్వే చేస్తున్నాం . ఈ నెల 20న 2వేల గ్రామాల్లోభూహక్కు పత్రాలు పంపిణీ చేస్తాం. రాష్ట్రంలో దళారీ వ్య వస్థ లేకుండా చేసి రైతులకు మేలు చేశాం అన్నారు. గతంలో రైతులను చంద్రబాబు గాలికొదిలేశారు. ఇప్పడు చంద్రబాబు, దత్తపుత్రుడు రైతు బాంధవుల వేషం వేశారు. వారికి తోడుగా రావణ సైన్యం గా పచ్చ మీడియా, ఛానెల్స్ నిలిచాయి. రైతులకు రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. బ్యాంకుల్లోపెట్టిన బంగారం ఇం టికి రప్పి స్తామని చెప్పి మోసం చేశారు. రైతులను మోసం చేసిన పెద్ద మనిషిని పచ్చమీడియా వారు ఒక్క మాట అడగరు.అని సీఎం జగన్ విమర్శించారు.
