సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లి గూడెం నుండి జనసేన అభ్యర్థిగా ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ నేడు, గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. . ఈ ఎన్నికల్లో కూటమికి ప్రజలు ఇచ్చిన తీర్పు నా భూతో నా భవిష్యత్తు అని , ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు, గత 5 ఏళ్లుగా అవినీతి తప్ప అభివృద్ధి లేక పడి ఉన్న ఈ పట్టణాన్ని అత్యాధునిక పట్టణంగా తీర్చిదిద్దుతానని తాడేపల్లిగూడం ప్రజలకు ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లుగా తీవ్ర దోపిడీ జరిగిందని, ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇకపై ఈ నియోజకవర్గంలో ఎవరైనా లంచం అడిగితే వారిని ఇంటికి పంపించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. తాను లంచం తీసుకోను.. మరొకరని తీసుకొనివ్వనని ప్రకటించారు. కూటమిలోని పార్టీ శ్రేణులు వెన్నంటే ఉండి తన విజయం కోసం ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. అందరూ కలిస్తే ఫలితం ఇలాగే ఉంటుందన్నారు. ఏ సమస్య వచ్చినా తన ఇంటి తలుపు తట్టాలని నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా బొల్లిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు.
