సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ఇకపై రిజర్వేషన్ రైలు టికెట్ల బుకింగ్ విషయంలో భారతీయ రైల్వే తీసుకొచ్చిన కొత్త నిబంధనలు నవంబర్1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. . ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇకపై నవంబర్1 నుంచి టికెట్లు బుక్ చేసుకునేవారికి మాత్రమే కొత్త నిబంధన వర్తిస్తుంది. నవంబర్1 నుంచి ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు మాత్రమే రిజర్వేషన్ టికెట్‌ను బుక్ చేసుకోగలరు. ఎవరైనా రైలు ప్రయాణాన్ని ప్లాన్ చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తించుకోవల్సి ఉంటుంది. ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లపై ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపదు. కొత్త విధానం రిజర్వేషన్ సౌకర్యం ఉన్న అన్ని రైళ్ళకు వర్తించనుంది. అన్ని తరగతులకు ఇదే విధానం వర్తిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *