సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకును గ్రేడ్–1 నుంచి సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీగా అప్ గ్రేడ్ చేస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్ ఉత్త ర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం మాత్రమే సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీలు కాగా.ఇకపై తణుకు పట్టణానికి కూడ ఆ హోదా వర్తిస్తుంది. 1979 లో సెంకండ్ గ్రేడ్ మునిసిపాలిటీగా అవతరించిన తణుకు పట్టణం శరవేగంగా అంచెలు అంచెలుగా ఎదిగి సెలక్షన్ గ్రేడ్ రావడంతో మునిసిపాలిటీకి అదనం గా సిబ్బంది పెరగడంతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఎక్కువ రాబట్టే అవకాశం ఉంది. ఫలితంగా రోడ్లు, డ్రెయి న్లు, తాగునీరు, విద్యుత్ దీపాలు మరింత మెరుగుపడ తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. దీనితో పాటు మునిసిపల్ పన్నులు కూడా పెరిగే అవకాశం ఉండటం తో ప్రజలలో మిశ్రమ స్వాందన వస్తుంది.
