సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం సాయంత్రం భీమవరం శివారు లోని తన నివాసం లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ.. ఉండి నుండి టీడీపీ అభ్యర్థిగా తన పేరు చంద్రబాబు ప్రకటించినట్లు తనకే చెప్పలేదని ఎందుకు అక్కడ రచ్చ చేస్తున్నారో? తెలియదని అన్నారు. అయితే తాను టీడీపీ చేరాను కనుక పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశం మేరకు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎంపీ గా పోటీ చెయ్యడమే తనకు ఇష్టమని , నరసాపురం లోక్ సభ ప్రజలు అదే కోరుకొంటున్నారని తన సర్వేలలో తేలిందని ప్రజాభిష్టానం మేరకే పార్టీల నిర్ణయాలు ఉండాలని తాను భావిస్తానని అన్నారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాననే విశ్వాసం నాకు ఉందని చెప్పారు. నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచా లేకపోతే అనంతపురం, నేనైతే కచ్చితంగా పోటీలో ఉంటానని, అందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు రాష్ట్రంలో 30 మంది పైగా పింఛన్ లకోసం, వృదుల మరణాలు కు టీడీపీ కారణం అంటూ సీఎం జగన్ చేస్తున్న అసత్య ఆరోపణలు త్రిప్పి కొట్టాలని, ప్రజా సంక్షేమాన్ని కోరుకునేవారు ఎవరైనా ఈ ప్రజా కంఠకుడిని ఇంటికి పంపాల్సిందే అన్నారు.
